ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి.. | At least 30 Yemeni soldiers killed in Aden suicide bombing | Sakshi
Sakshi News home page

ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి..

Dec 18 2016 12:19 PM | Updated on Nov 6 2018 8:35 PM

ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి.. - Sakshi

ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి..

ఓ ఉగ్రవాది సైనికుల గుంపులో కలిసిపోయి భారీ పేలుడు పదార్థాలతో పేల్చేసుకున్నాడు.

అడెన్‌: యెమెన్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మృతి చెందారు. దేశ దక్షిణ ప్రాంతంలోని సిటీ అడెన్‌లో ఆదివారం సైనికులు తమ జీతాలు తీసుకోవడానికి గుంపుగా ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

ఓ ఉగ్రవాది సైనికుల గుంపులో కలిసిపోయి భారీ పేలుడు పదార్థాలతో తనను తాను పేల్చేసుకున్నాడని సీనియర్‌ మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అడెన్‌లోని అల్‌- సోల్బాన్‌ మిలిటరీ బేస్‌లో ఈ దాడి జరిగింది. వారం రోజుల క్రితం అడెన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఇదే తరహాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. వరుస ఆత్మాహుతి దాడులు ఎమెన్‌ సైనికులను బెంబేలెత్తిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement