యెమెన్‌లో వైమానిక దాడి..  ముగ్గురి మృతి | Airstrike killed three children in Yemen and wounded others | Sakshi
Sakshi News home page

యెమెన్‌లో వైమానిక దాడి..  ముగ్గురి మృతి

Oct 18 2026 6:44 AM | Updated on Oct 18 2026 6:44 AM

Airstrike killed three children in Yemen and wounded others

దుబాయ్‌: యెమెన్‌లో జరిగిన వైమానిక దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి సౌదీ అరేబియానే కారణమని ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు. యెమెన్‌లోని నైరుతి ధమార్‌ ప్రావిన్స్‌లో ఈ దాడి జరిగినట్లు చెప్పారు. ఈ దాడుల్లో 8 ఏళ్ల ఒక బాలుడు, 10 ఏళ్ల ఇద్దరు చిన్నారులు మరణించగా, డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారని హౌతీల ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. హౌతీల ఆరోపణలపై సౌదీ అరేబియా ఇంకా స్పందించలేదు.  సెప్టెంబరులో పోరాటం తిరిగి ప్రారంభమైనప్పటి నుండి తమ భూభాగా 124 మంది మరణించారని, వారిలో ఈ చిన్నారులు కూడా ఉన్నారని హౌతీలు చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement