ఇమ్రాన్‌కు ఒవైసీ కౌంటర్..! | Asaduddin Owaisi Reaction On Imran Khan Comments | Sakshi
Sakshi News home page

పాక్‌లో ముస్లిం మాత్రమే ప్రధాని కాగలడు

Dec 24 2018 9:57 AM | Updated on Dec 24 2018 12:45 PM

Asaduddin Owaisi Reaction On Imran Khan Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మైనార్టీల రాజకీయ హక్కుల విషయంలో భారత్‌ను చూసి పాకిస్తాన్‌ చాలా నేర్చుకోవాలని హితవుపలికారు. పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే ఆ దేశానికి ప్రధాని కాగలడని, భారత్‌లో అన్ని వర్గాల ప్రజలకు ఆ అవకాశం ఉంటుందని అసద్‌ తెలిపారు.

మైనార్టీల పట్ల భారతదేశం వ్యవహిరిస్తున్న తీరును చూసి మీరు నేర్చుకోవాలని ఒవైసీ పేర్కొన్నారు. ‘‘భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇటీవల ఇమ్రాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement