పాక్‌ అధ్యక్షుడిగా ఆరిఫ్‌ అల్వీ ప్రమాణం

Arif Alvi as the President of Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ 13వ అధ్యక్షుడిగా ఆరిఫ్‌ అల్వీ (69) ప్రమాణం చేశారు. ఆదివారం ఐవాన్‌–ఇ–సద్ర్‌ (అధ్యక్ష భవనం)లో జరిగిన కార్యక్రమంలో అల్వీతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ షకీబ్‌ నిసార్‌ ప్రమాణం చేయించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ క్వమర్‌ జావెద్‌ బజ్వాతో పాటు పౌర, సైనిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.   పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అల్వీ.. వృత్తిరీత్యా డెంటిస్ట్‌. ఇమ్రాన్‌ ఖాన్‌కు సన్నిహితుడు కూడా. 2006 నుంచి 2013 వరకు పీటీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top