వీడు చచ్చినా సాధిస్తున్నాడురా..! అని కొందరిని తిట్టుకుంటుంటాం.. కానీ, వీడు చచ్చినా సంపాదిస్తున్నాడురా! అనే మాట ఎప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం? చనిపోయిన తరువాత ఎవరైనా ఎలా సంపాదిస్తారు? అది కూడా.. కోట్ల రూపాయలా..? అస్సలు బతికి ఉన్నవాళ్లే డబ్బు సంపాదించేందుకు నానా కష్టాలు పడుతుంటే మరణించినవారికెలా సాధ్యమనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు కావాలంటే ఈ కథనం చదవాల్సిందే!
మైకెల్ జాక్సన్
పాప్ సంగీతానికి రారాజుగా వెలుగొందిన మైకెల్ జాక్సన్ 50 ఏళ్ల వయసులో 2009లో మరణించారు. మైకెల్ మరణాంనంతరం కూడా సంపాదిస్తున్నారు. ఈయన అల్బమ్స్ అమ్మినందుకుగాను ఆయా కంపెనీలు ప్రతి ఏటా 115 మిలియన్ డాలర్ల మొత్తాన్ని జాక్సన్‌కు ఇంకా చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం మైకెల్ ఆల్బమ్స్‌ను సోనీ కంపెనీ పబ్లిష్ చేస్తోంది. పాప్ కింగ్ గా పేరు మోసిన జాక్సన్ సంగీత, నృత్యాల్లో, మ్యూజిక్ వీడియోల్లో విప్లవం తెచ్చారు. 1958 ఆగస్టు 29వ తేదీన ఆయన జన్మించారు.
చిన్ననాటి నుంచే పాప్ సింగర్ గా పేరు పొందాడు. తన నలుగురు సోదరులతో కలిసి ఐదుగురితో పాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 1969లో ఈ గ్రూప్ మోటవున్ రికార్డ్సతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అప్పటి నుంచి మైకెల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జాక్సన్ ఆల్బం ‘థ్రిల్లర్’ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లరుగా రికార్డు సృష్టించింది. జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.
ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ
ఎల్విస్ ప్రీస్లీ కూడా మరణాంనంతరం ఏటా 55 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. తను రూపొందించిన ఆల్బమ్స్‌ను పబ్లిష్ చేస్తున్న కంపెనీ ఈ మొత్తాన్ని అందజేస్తుంది. ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ ఒక అమెరికన్ గాయకుడు, నటుడు. 20 వ శతాబ్దంలో అమెరికాలో పేరుగాంచిన ప్రముఖ నటుడు ప్రీస్లీ. 13 ఏళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టాడు. రాక్ అండ్ రోల్, హార్డ్ బ్రేక్ హోటల్ ప్రీస్లీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈయన ఆల్బమ్స్ రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్ల విక్రయాలు జరిపాయి. అతిగా డ్రగ్స తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి 42 ఏళ్ల వయసులోనే ప్రీస్లీ మరణించాడు.
చార్లెస్ షుల్జ్
ప్రముఖ అమెరికన్ కార్టూనిస్టు చార్లెస్ షుల్జ్. చార్లెస్ మరణాంనతరం కూడా దాదాపు సంవత్సరానికి 40 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఈయన గీసిన కార్టూన్లను ప్రచురించే సంస్థ ఈ మొత్తాన్ని చార్లెస్ కుటుంబ సభ్యులకు అందజేస్తోంది. అనేక స్పూర్తినిచ్చే కార్టూన్లను చార్లెస్ గీశాడు. ఈయన రూపొందించిన పీనట్స్ కార్టూన్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలలో 21 భాషల్లో ప్రచురిస్తోంది. అమెరికాలో 3డి-యానిమేటెడ్ సినిమాగా కూడా పీనట్స్ వచ్చింది. 77 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో చార్లస్కు పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించాడు.
ఎలిజిబెత్ టేలర్
ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజిబెత్ టేలర్. ఈమె నటించిన సినిమాలు ఇప్పటికీ అమ్ముడుపోతున్నాయి. ఇందుకుగాను ఈమెకు ప్రతి ఏటా 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందజేస్తున్నారు. హాలివుడ్ యొక్క స్వర్ణయుగంలో గొప్ప నటీమణుల్లో టేలర్ ఒకరు. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ చారిత్రక నటిమణుల్లో టేలర్‌కు ఏడవ స్థానం కల్పించారు. 1943లో విడుదలైన మెక్డోవల్ చిత్రం టేలర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గుండె సంబంధిత వ్యాధిలో 79 ఏళ్ల వయసులో 2011 సంవత్సరంలో టేలర్ మరణించారు.
బాబ్ మెర్లీ
బాబ్ మెర్లీ మరణాంనంతరం కూడా ప్రతి ఏటా దాదాపు 21 మిలియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. మెర్లీ బెవరేజ్ కంపెనీ, హౌజ్ ఆఫ్ మెర్లీ, ఆల్బమ్స్ ద్వారా ఆయన ఈ మొత్తాన్ని పొందుతున్నాడు. మెర్లీ గాయకుడే కాకుండా పాటల రచయిత, గిటారిస్టు, సంగీత దర్శకుడు కూడా. తన ప్రతిభతో అంతర్జాతీయంగా సినీదిగ్గజాల ప్రశంసలు మెర్లీ పొందాడు .ఈయన రూపొందించిన ‘ది వైలర్స్’తో మంచి పేరు సంపాదించుకున్నాడు. వన్ లవ్, కాయా, వెయిటింగ్ ఇన్ వెన్, జామింగ్ ఆల్బమ్స్ ప్రఖ్యాతిగాంచాయి. క్యాన్సర్ బారిన పడి 36 ఏళ్ల వయసులోనే 1981లో మెర్లీ మరణించాడు.
చనిపోయినా.. సంపాదిస్తున్నారు!
Published Mon, Oct 10 2016 8:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్‌పై మరో లుక్అవుట్ నోటీసు
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
ముంబైని ముంచేసిన కేకేఆర్
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement