చైనాలో మసీదులపై జాతీయ జెండా | all mosques to raise national flag | Sakshi
Sakshi News home page

చైనాలో మసీదులపై జాతీయ జెండా

May 22 2018 3:57 AM | Updated on May 22 2018 3:57 AM

all mosques to raise national flag - Sakshi

బీజింగ్‌: దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అన్ని మసీదుల్లో నిత్యం చైనా జాతీయ జెండాను ఎగురవేయాలని చైనా ఇస్లామిక్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. దీంతో పాటు చైనా రాజ్యాంగాన్ని, సోషలిస్టు విలువలను తప్పనిసరిగా అభ్యసించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే గ్లోబల్‌ టైమ్స్‌ ఓ లేఖను ప్రచురించింది. పలువురు చైనా నిపుణులు దీనిని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని చదవటం వల్ల మతపరమైన అభివృద్ధి కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 20 లక్షల మంది ముస్లింలున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement