
ఖాట్మాండు: కరోనా పోరాటంలో నేపాల్‌కు సాయం చేసేందుకు ఏషియన్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ మరోసారి ముందుకొచ్చింది. మంగళవారం 250 మిలియన్ డాలర్ల రాయితీ రుణాన్ని ఏడీబీ నేపాల్‌కు మంజూరు చేసింది. ఈ విషయంపై ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకావా మాట్లాడుతూ... ఈ విపత్కర పరిస్థితుల్లో ఏడీబీ నేపాల్‌కు అండగా నిలబడుతుంది. ఈ రాయితీ రుణం నేపాల్ ప్రభుత్వం పేదలకు మరింత సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. నేపాల్ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడానికి ఈ రుణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కరోనా మహమ్మారి చాలా కాలం వరకు కొనసాగుతూ ప్రజారోగ్యంతో పాటు నేపాల్ సామాజిక, ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఏడీబీ ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తూ నేపాల్‌కు అండగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. (భారత్పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు)
ఇప్పటికే కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ సపోర్టు (కేర్) కార్యక్రమం రోజుకు మూడులకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు, రెండు లక్షల మందికి క్వారంటైన్ సదుపాయాలు కల్పించేందుకు దోహదపడింది. ఏడీబీ సాయంతో నేపాల్ ప్రభుత్వం వైద్యపరమైన, ఆర్థికపరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు పేదలకు ఆహారాన్ని అందిచడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే యునిసెఫ్‌తో కలిసి 3లక్షల డాలర్లను ఏడీబీ నేపాల్‌కు అందించింది. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం)