ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు

Acts Should Not Done From President Office Says American Court - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి షాక్‌ తగిలింది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల్ని నిషేధిస్తూ ఆయనిచ్చిన ఉత్తర్వులపై దిగువకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు 9వ యూఎస్‌ సర్కిల్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ నిరాకరించింది. ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు ప్రసుత్తమున్న అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవనీ, సాక్షాత్తూ కాంగ్రెస్‌ను విస్మరించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. చట్టాలను కోర్టు గదుల నుంచి, ఓవల్‌ (అధ్యక్ష) కార్యాలయం నుంచి చేయలేమని చురకలు అంటించింది. ఓ వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించాడన్న ఆధారంగా అతనిపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను 2-1 మెజారిటీతో తోసిప్చుంది. అమెరికా–మెక్సికో సరిహద్దు ద్వారా ఆశ్రయం కోరుతూ వలస దారులు దేశంలోకి రావడాన్ని ట్రంప్‌ గత నెల 9న నిషేధించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top