బుల్‌ఫైట్‌ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము | A bull’s 11-inch horn goes inside a bullfighter’s butt | Sakshi
Sakshi News home page

బుల్‌ఫైట్‌ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము

Mar 24 2017 12:30 PM | Updated on Sep 5 2017 6:59 AM

బుల్‌ఫైట్‌ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము

బుల్‌ఫైట్‌ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము

బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడుస్తూ హింసించే బుల్‌ఫైట్‌ క్రీడలో దారుణం చోటు చేసుకుంది.

మెక్సికో:
బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడుస్తూ హింసించే బుల్‌ఫైట్‌ క్రీడలో దారుణం చోటు చేసుకుంది. దున్నపోతుకు, బుల్‌ఫైటర్‌కు మధ్య మెక్సికోలో హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో దున్నను తన చేతిలో ఉన్న ఎరుపు రంగు జెండాను చూపిస్తూ తన ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అదును చూసుకొని దున్న బుల్‌ ఫైటర్‌ను ఒక్క కుమ్ము కుమ్మడంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో జెండాతో పాటూ చేతిలోని ఆయుధం కిందపడిపోయాయి. కిందపడిపోయిన అతనిపై దున్న ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించింది.

తప్పించుకోవడానికి ప్రయాత్నించే క్రమంలోనే దున్న అతని వెనకవైపు భాగంతో పొడిచింది. దీంతో 11 ఇంచుల మేర కొమ్ము అతని వెనక భాగంలోకి దూసుకుపోయింది. తీవ్రగాయాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement