గిఫ్ట్‌ ఇస్తే...మింగేశాడు | 7 year-old boy swallows Apple AirPod, rushed to hospital for Xrays | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌ ఇస్తే...మింగేశాడు

Jan 4 2020 1:21 PM | Updated on Jan 4 2020 1:55 PM

7 year-old boy swallows Apple AirPod, rushed to hospital for Xrays - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శాన్‌ఫ్రాన్సిస్కో: తల్లిదండ్రులు క్రిస్మస్‌ గిప్ట్‌గా ఇచ్చిన ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను ఓ ఏడేళ్ల బాలుడు పొరబాటున మింగేసిన ఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో  చోటు చేసుకుంది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లి భయంతో వణికిపోయారు. వెంటనే తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని  చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నామని స్వయంగా  బాలుడి తల్లి సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

కియారా స్ట్రౌడ్  ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం ఆమె తన ఏడేళ్ల కుమారుడు క్యూజెకు  క్రిస్మస్  బహుమతిగా  ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను కొనిచ్చారు.  కేవలం మూడు రోజుల తరువాత, దాన్ని నోటితో పట్టుకొని పొరపాటున ఒకదాన్ని మింగేసాడు. ఈవిషయాన్ని వెంటనే గమనించిన కియారా బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసిన డాక్టర్లు ఎయిర్‌పాడ్ పిల్లాడి పొట్టలోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే దాన్ని బయటకు తీయడానికి శస్త్రచికిత్స అవసరం లేదని, కొన్ని రోజుల్లో అదే బయటపడుతుందని చెప్పారు. అది పక్కటెముకలకు కింది భాగంలో ఉండటం వల్ల ఆ బాలుడికి ఎటువంటి హానీ జరగదని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement