అబు బకర్ జాడ చెబితే రూ. 60 కోట్లు | 60 crores for Information on Abu Bakr al-Baghdadi | Sakshi
Sakshi News home page

అబు బకర్ జాడ చెబితే రూ. 60 కోట్లు

Jul 11 2014 2:11 AM | Updated on Apr 4 2019 3:25 PM

అబు బకర్ జాడ చెబితే రూ. 60 కోట్లు - Sakshi

అబు బకర్ జాడ చెబితే రూ. 60 కోట్లు

ఇరాక్, సిరియాలో తిరుగుబాటు దారులకు నేతృత్వం వహిస్తూ... రక్తపాతాన్ని పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్ (ఐఎస్‌ఐఎల్) సంస్థ అధినేత అబు బకర్ ఆల్ బాగ్దాదీ తలకు అమెరికా వేలం కట్టింది.

 వాషింగ్టన్: ఇరాక్, సిరియాలో తిరుగుబాటు దారులకు నేతృత్వం వహిస్తూ...  రక్తపాతాన్ని పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్ (ఐఎస్‌ఐఎల్) సంస్థ అధినేత అబు బకర్ ఆల్ బాగ్దాదీ తలకు అమెరికా వేలం కట్టింది. అబు బకర్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి కోటి డాలర్లు (రూ.60 కోట్లు) బహుమతినిస్తామని ప్రకటించింది. ఇస్లామిక్ రాజ్యాధినేతగా అబుబకర్ తన పేరును ఇటీవలే ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఇతడు ఎక్కడున్నాడో చెప్పినా, అరెస్ట్ చేసేందుకు వీలుగా తగిన సమాచారాన్ని అందించినా కోటి డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement