గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.
ఏథెన్స్ : గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని గ్రీకు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లెఫ్కడ ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మధ్యధరాసముద్రంలో ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.