54 మంది ఉగ్రవాదులు హతం | 54 militants killed in Afghanistan | Sakshi
Sakshi News home page

54 మంది ఉగ్రవాదులు హతం

Mar 15 2015 2:31 PM | Updated on Sep 2 2017 10:54 PM

కాబూల్: తాలిబన్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘానిస్తాన్ సైన్యం చేతిలో 54 తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

కాబూల్: తాలిబన్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘానిస్తాన్ సైన్యం చేతిలో 54 తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఘాంజీ, కాందహార్, లగ్మాన్, ఫర్యాబ్, సారిపౌల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు తాము 24గంటలపాటు సైనిక దాడులు నిర్వహించామని ఇందులో 54 మంది హతమయ్యారని, 18 మందిని బంధీలుగా పట్టుకున్నామని అందులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement