తైవాన్లో భూకంపం | 5.8-magnitude quake felt in Taiwan | Sakshi
Sakshi News home page

తైవాన్లో భూకంపం

Feb 2 2016 11:15 PM | Updated on Aug 24 2018 7:34 PM

ఈశాన్య తైవాన్లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదు అయింది.

తైపీ : ఈశాన్య తైవాన్లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మంగళవారం రాత్రి 10.19 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది. అయితే ఈ భూకంప ధాటికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. సునామీ వచ్చే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement