ఈజిప్టులో ఘర్షణలకు పాల్పడిన ముగ్గురు నిషేధిత ముస్లిం పార్టీ ముస్లిం బ్రదర్ హుడ్ సభ్యులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది.
కైరో: ఈజిప్టులో ఘర్షణలకు పాల్పడిన ముగ్గురు నిషేధిత ముస్లిం పార్టీ ముస్లిం బ్రదర్ హుడ్ సభ్యులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 25మందికి జీవిత ఖైదు విధించగా.. 21మందికి 15 ఏళ్ల జైలు, 22మందికి పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2013 ఆగస్టులో అలెగ్జాండ్రియాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
అయితే, వీటి వెనుక ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని, ఆరోజు ఘర్షణలు తగ్గించేందుకు ప్రయత్నించిన బలగాలపై కూడా వారు దాడులకు ఉసిగొల్పారని స్పష్టమైనట్లు ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. దీంతోపాటు వారు ఒక పోలీసు అధికారి చంపడమే కాకుండా సైనికుడిని చంపేశారని, పలువురు భద్రతా సిబ్బందిని గాయపరిచారని కూడా కోర్టు పేర్కొంది.