3డీ ప్రింట్‌తో రాకెట్ ఇంజన్ విడిభాగాలు | 3-D print rocket engine parts | Sakshi
Sakshi News home page

3డీ ప్రింట్‌తో రాకెట్ ఇంజన్ విడిభాగాలు

Nov 15 2014 1:23 AM | Updated on Sep 2 2017 4:28 PM

3డీ ప్రింట్ పరిజ్ఞానంతో రాకెట్ ఇంజన్ విడిభాగాలను రూపొందించడమే కాక వాటిని విజయవంతంగా పరీక్షించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.

  •  విజయవంతంగా పరీక్షించిన నాసా
  • వాషింగ్టన్: 3డీ ప్రింట్ పరిజ్ఞానంతో రాకెట్ ఇంజన్ విడిభాగాలను రూపొందించడమే కాక వాటిని విజయవంతంగా పరీక్షించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఉష్ణోగ్రత, తీవ్రతను రాగి మిశ్రమంతో రూపొం దించిన ఈ 3డీ విడిభాగాలు తట్టుకుంటాయని ఈ పరీక్షల్లో వెల్లడైంది. నాసాలోని గ్లెన్ రిసెర్చ్ సెంటర్‌లోని ఎయిరోజెట్ రాకెట్‌డైన్(ఏఆర్)తో నాసా సంయుక్తంగా ఈ 3డీ రాకెట్ విడిభాగాలను తొలిసారి విజయవంతంగా పరీక్షించింది.

    3డీ పరిజ్ఞానం ఉపయోగించి రూపొందించిన రాకెట్ ఇంజన్ విడిభాగాలపై అత్యంత కఠినమైన పరీక్షలు జరపడం ఇదే మొదటిసారి. నాసా, ఏఆర్ కలిపి నాలుగు ఇంజెక్టర్లపై మొత్తం 19 రకాల హాట్ ఫైర్ టెస్ట్‌లను పరిశోధకులు నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్వహించిన ఈ పరీక్షలన్నీ విజయవంతమైనట్టు నాసా తెలిపింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement