సోమాలియాలో 25 మంది తీవ్రవాదులు మృతి | 25 Al Shabaab militants killed in Somalia | Sakshi
Sakshi News home page

సోమాలియాలో 25 మంది తీవ్రవాదులు మృతి

Aug 20 2015 9:26 AM | Updated on Sep 3 2017 7:48 AM

సోమాలియాలోని హిరాన్ ప్రాంతంలో ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారని సైనిక ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు.

మొగాదీష్ :  సోమాలియాలోని హిరాన్ ప్రాంతంలో ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారని సైనిక ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వీరంతా అల్ షబాబ్ తీవ్రవాద సంస్థకు చెందిన వారని తెలిపారు. ప్రభుత్వ దళాలు, ఇథియోపియన్ దళాలు సంయుక్తంగా గత 48 గంటల పాటు జరిపిన పోరులో ఈ తీవ్రవాదులను మట్టుబెట్టారని చెప్పారు.

లక్ జీలో గ్రామంలో అత్యధికంగా తీవ్రవాదులు మరణించారని చెప్పారు. అల్ షబాబ్ తీవ్రవాదుల చెరలో ఉన్న గ్రామాలను వారి నుంచి విడిపించే వరకు ఈ పోరు జరుగుతుందని సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement