అజర్‌బైజాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం | 24 dead in Azerbaijan drug rehab centre fire | Sakshi
Sakshi News home page

అజర్‌బైజాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం

Mar 3 2018 2:11 AM | Updated on Sep 5 2018 9:47 PM

24 dead in Azerbaijan drug rehab centre fire - Sakshi

అగ్నికి ఆహుతవుతున్న డ్రగ్‌ రిహాబిలిటేషన్‌ కేంద్రం

బాకు: అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కలపతో నిర్మించిన పునరావాస కేంద్రంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో కదల్లేని స్థితిలో ఉన్న రోగులు సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 200 మంది రోగులను, అక్కడి సిబ్బందిని రక్షించారు. దాదాపు 10 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద కారణాలపై మరింత లోతుగా విచారణ సాగుతోందని అధికారులు చెప్పారు. అజర్‌బైజాన్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement