18 ఏళ్లుగా బొమ్మను వదలడం లేదు..!! | For 18 Years Father Brings Toy Given By Daughter To Workplace | Sakshi
Sakshi News home page

Apr 4 2018 4:56 PM | Updated on Aug 16 2018 4:21 PM

For 18 Years Father Brings Toy Given By Daughter To Workplace - Sakshi

తండ్రీ కూతుళ్లు సమంత హోల్మ్స్‌ పాట్‌ హోల్మ్స్‌

వాషింగ్టన్‌ : మానవ సంబంధాలు పలుచనవుతున్న పాశ్చాత్య సమాజంలో ఓ తండ్రీ కూతుళ్ల ప్రేమానుబంధం అందరికీ ముచ్చటగొల్పుతోంది. కూతురిపై అమితమైన ప్రేమ కురిపించే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? 18 ఏళ్ల క్రితం ఆమె చెప్పిన మాటను రోజూ గుర్తు చేసుకుంటున్నాడు. రెండేళ్ల పాపాయిగా ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన కానుకను ఆ తండ్రి ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. ముద్దు ముద్దు మాటలతో తన కూతురు సమంత హోల్మ్స్‌ (20) ‘నేను లేనప్పుడు ఈ బొమ్మతో ఆడుకో డాడీ’ అంటూ తండ్రి పాట్‌ హోల్మ్స్‌కు ఇచ్చిన తాబేలు బొమ్మను అతను ప్రతి నిత్యం తన బ్యాగులో భద్రంగా దాచుకొని ఆఫీస్‌కి కూడా తీసుకెళ్తున్నాడు. సినిమాలు, షికార్లు, విహార యాత్రలు..ఇలా ఎక్కడికెళ్లినా కూతురిచ్చిన ఆ బొమ్మను మాత్రం వదలడు.

కొడుకు జాక్‌, కూతురు సమంతలు తనకు దేవుడిచ్చిన వరం అంటూ పొంగిపోతున్నాడు పాట్‌. ‘మానవ విలువలు దిగజారకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం అంటూ ఉండాలి. అప్పుడే జీవితంలోని మంచి, చెడులు.. కష్ట నష్టాల విలువ తెలుస్తుంది’ అంటున్నాడు పాట్‌ హోల్మ్స్‌. తండ్రి తనపై కురిపించే ప్రేమలో సమంత తడిసి ముద్దవుతోంది. ‘ప్రతి సందర్భంలోనూ మేమంతా కలిసే ఉంటాం. ఏ చిన్న పండగయినా, విశేషమయినా కుటుంబంతో కలిసే జరుపుకుంటాం. నెలలో 30 రోజులుంటే దాదాపు 28 రోజులు కుటుంబం అంతా కలిసి డిన్నర్‌ చేస్తాం’ అంటూ సమంత తల్లిదండ్రులు, సోదరుడితో తన అనుబంధాన్ని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement