హొండురస్‌ జైల్లో 18 మంది ఖైదీల మృతి | 18 prisoners dead in clash at Honduras jail | Sakshi
Sakshi News home page

హొండురస్‌ జైల్లో 18 మంది ఖైదీల మృతి

Dec 22 2019 2:58 AM | Updated on Dec 22 2019 2:58 AM

18 prisoners dead in clash at Honduras jail - Sakshi

టెగుసిగల్ప: సెంట్రల్‌ అమెరికాలోని హొండురస్‌ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ ఆదేశాలు జారీ చేశారు.  జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement