మధ్య చైనా హినాన్ ప్రావిన్స్లో రెండంతస్తుల భవనం కుప్ప కూలింది.
బీజింగ్ : మధ్య చైనా హినాన్ ప్రావిన్స్లో రెండంతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్, అగ్నిమాపక, పోలీసు ఉన్నతాధికారులు... సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
శిథిలాల కింద చిక్కుకుని ఉన్న దాదాపు 40 మంది పనివారిని రక్షించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1990 నాటి భవనానికి మరమత్తులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిందని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని వారు చెప్పారు. ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది.