వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతిచెందగా, మరో 5 మందికి కాలిన గాయాలయ్యాయి.
వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతిచెందగా, మరో 5 మందికి కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఉక్రెయిన్ రాజధాని కియేవ్ నగరంలో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. అందరూ వయసు పైబడిన వారు కావడంతో అగ్నికీలల నుంచి త్వరగా బయట పడలేక పోయారు. ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం అధికారి మైకొలా చిచేత్కిన్ ఈ వివరాలను వెల్లడించారు. రెండు గదులలో వృద్ధాశ్రమాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశారు. ఇందులో 35 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించారు.
రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసి పెద్దవాళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించింది. కాలిన గాయాలయిన ఐదు మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిషన్ వేసినట్లు ప్రధాని వొలొడిమిర్ గ్రోస్మాన్ తెలిపారు. పురాతన బిల్డింగ్ కావడంతో అక్కడా తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.