16 సెకన్లు.. 16 వేల టన్నులు

వాషింగ్టన్ : 16వేల టన్నుల బరువున్న 21 అంతస్థుల బిల్డింగ్‌ను కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెత్లేహెం స్టీల్ కంపెనికి చెందిన ఈ 21 అంతస్థుల మార్టిన్ భవనాన్ని 1972లో ప్రారంభించారు. అయితే గత 12 ఏళ్లుగా ఈ బిల్డింగ్ నిరుపయోగంగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం బిల్డింగ్‌ను కూల్చివేయాలనుకుంది. అందుకు కోసం 219 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించింది. ఈ క్రమంలో 16 వేల టన్నుల బరువున్న ఈ భవనాన్ని కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేసింది.
ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన గురించి చుట్టుపక్కల ప్రజలు.. ‘మేం భావించిన దాని కంటే చాలా పెద్ద శబ్దం వినిపించింది. మా కాళ్ల కింద భూమి కదిలిపోతుందేమో అనిపించింద’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్న ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి