
12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. 51 మందిని చంపాడు!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిరియా- టర్కీ సరిహద్దుల్లోని ప్రాంతంలో ఈ దాడి జరిగింది. టర్కీలో ఈ ఏడాది జరిగిన ఉగ్రవాద దాడులన్నింటిలో ఇది అత్యంత దారుణమైనదని అంటున్నారు. ఈ దాడిని ప్రధానమంత్రి బినాలీ ఇల్డిరిమ్ ఖండించారు. పెళ్లి వేడుకను కాస్తా విషాద సమంగా మార్చేశాడని, ఇలాంటి దాడులను కఠినంగా అణిచేయాలని అన్నారు.