సిరియాలో బాంబు పేళుల్లు.. | 12 killed in Syria bombings | Sakshi
Sakshi News home page

సిరియాలో బాంబు పేళుల్లు..

Jul 2 2017 2:13 PM | Updated on Sep 5 2017 3:02 PM

సిరియాలో బాంబుపేళుల్లు కలకలం సృష్టించింది..

డమాస్కస్: సిరియాలో బాంబుపేళుల్లు కలకలం సృష్టించింది. కారుబాంబర్లు జరిపిన దాడుల్లో సుమారు 12 మంది మృతి చెందగా 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు మూడు కార్లలో వచ్చిన బాంబర్లను వెంబడించగా రెండు కార్లలోని బాంబర్లు పేల్చుకున్నారని మరో కారుబాంబర్‌ తప్పించుకున్నట్లు సిరియా మీడియా వర్గాలు తెలిపాయి. కారు బాంబర్లు గుంపులుగా ఉన్న ప్రాంతాలనే టార్గెట్‌ చేసుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement