ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ! | 106 year old Virginia McLaurin dances from joy as she meets Barack Obama | Sakshi
Sakshi News home page

ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ!

Feb 22 2016 12:55 PM | Updated on Sep 3 2017 6:11 PM

ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ!

ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులను కలిసిన ఓ 106 ఏళ్ల బామ్మ సంతోషంతో స్టెప్పులేసింది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులను కలిసిన ఓ 106 ఏళ్ల బామ్మ సంతోషంతో స్టెప్పులేసింది. బామ్మ ఉత్సాహానికి ఆశ్చర్యపోయిన ఒబామా.. మీరు ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండటం వెనుక రహస్యం ఏంటీ అని ఆమెను ప్రశ్నించాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఒబామా దంపతులంటే ఉన్న అభిమానంతో వారిని కలుసుకోవాలని వర్జీనియా మెక్ లారెన్ అనే మహిళ 2014లో వైట్హౌస్కు దరఖాస్తు పెట్టుకుంది. మెక్ లారెన్ అభ్యర్థనకు అంగీకరించిన వైట్హౌస్ వర్గాలు ఆదివారం ఒబామా దంపతులను కలవడానికి అవకాశం కల్పించారు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన వారిని మొదటిసారి కలిసిన సంతోషంలో ఆ బామ్మ ఊతకర్ర సహాయంతోనే ఒబామా, మిచెల్లతో కలిసి స్టెప్పులేసింది. అనంతరం మాట్లాడుతూ.. అమెరికా మొట్టమొదటి నల్లజాతి ప్రెసిడెంట్ ఒబామాను, ఆయన సతీమణి మిచెల్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement