బాబు మది నిండా మురికి ఆలోచనలే | ysrcp leader uppuleti kalpana criticise cm chandrababu on his comments on slum people | Sakshi
Sakshi News home page

బాబు మది నిండా మురికి ఆలోచనలే

Feb 22 2016 2:31 AM | Updated on Aug 14 2018 11:26 AM

బాబు మది నిండా మురికి ఆలోచనలే - Sakshi

బాబు మది నిండా మురికి ఆలోచనలే

ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఆయన మానసిక స్థితి బాగా లేనట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన అన్నారు.

♦ సీఎంను మానసిక వైద్యుడికి చూపించండి
♦ వైఎస్సార్‌సీపీ ఎల్పీ ఉపనేత ఉప్పులేటి కల్పన సూచన
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఆయన మానసిక స్థితి బాగా లేనట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన  అన్నారు. చంద్రబాబును మానసిక వైద్యుడికి చూపించి చికిత్స చేయించాలని ఆయన కుటుంబ సభ్యులకు సూచించారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మురికివాడల్లో ఉండే వారికి మురికి ఆలోచలే వస్తాయని సీఎం వ్యాఖ్యానించడం సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా ఉందన్నారు. వాస్తవానికి చంద్రబాబు మది నిండా మురికి ఆలోచనలే ఉన్నాయని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ టికెట్లపై గెలుపొందిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటే టీడీపీ బలపడుతుందనుకోవడం వట్టి అవివేకమని ఉప్పులేటి కల్పన అన్నారు. ప్రలోభ పెట్టి, పదవుల ఆశ చూపి ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీలోకి చేర్చుకోవచ్చు గానీ ఆ నియోజకవర్గ ప్రజల ఓట్లు కూడా వేయించుకోగలరా? అని ఆమె నిలదీశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేస్తున్నారంటూ అనుకూల మీడియా సహాయంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయినా ఇప్పటివరకు ఒక్కరు కూడా వెళ్లలేదన్నారు. జగన్ ఉదయించే సూర్యుడైతే చంద్రబాబు అస్తమిస్తున్న సూర్యుడని పేర్కొన్నారు.

 రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారు: ఆర్కే
 ‘‘సీఎం చంద్రబాబు పుట్టుకలోనే అవినీతి ఉంది. అక్రమ నివాసంలో గడుపుతూ.. అక్రమాలతో సావాసం చేసే చంద్రబాబుకు రాజకీయ విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తన అవినీతి బాగోతాలను, పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.’’ అని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అవినీతికి బార్లా తలుపులు తెరిచారని మండిపడ్డారు. ఆర్కే ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement