బాబు, కేఈలే హత్య చేయించారు | YSRCP fires on Narayan Reddy murder | Sakshi
Sakshi News home page

బాబు, కేఈలే హత్య చేయించారు

May 22 2017 2:10 AM | Updated on Aug 10 2018 8:23 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు, పత్తికొండ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తిలే ఒక పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ

- వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం.. నేడు కర్నూలు జిల్లా బంద్‌
- నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న వైఎస్‌ జగన్‌


సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు, పత్తికొండ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తిలే ఒక పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య జరిగిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నారాయణరెడ్డి దారుణ హత్యకు నిరసనగా   సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

గత మూడేళ్లుగా టీడీపీ సాగిస్తున్న అరాచక పాలనకు నారాయణరెడ్డి హత్య పరాకాష్టగా వైఎస్సార్‌సీపీ పేర్కొంది.  ఈ హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఖండిస్తున్నామని తెలిపింది. గుంటూరులో ఉండగా ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కడప పర్యటనను రద్దు చేసుకున్నారని, సోమవారం వెల్దుర్తి మండలం చెరుకులపాడులో జరిగే నారాయణరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరవుతారని పార్టీ తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement