కమలా అద్వానీ మృతికి వైఎస్ జగన్ సంతాపం | ys jagan mohan reddy condoles Kamla Advani's demise | Sakshi
Sakshi News home page

కమలా అద్వానీ మృతికి వైఎస్ జగన్ సంతాపం

Apr 6 2016 8:08 PM | Updated on Jul 25 2018 4:09 PM

కమలా అద్వానీ మృతికి వైఎస్ జగన్ సంతాపం - Sakshi

కమలా అద్వానీ మృతికి వైఎస్ జగన్ సంతాపం

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మరణం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మరణం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అద్వానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

గుండెపోటుతో కమలా అద్వానీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement