అమ్మా నన్ను క్షమించు... | youth sends sms to mother | Sakshi
Sakshi News home page

అమ్మా నన్ను క్షమించు...

Aug 25 2015 8:28 AM | Updated on Oct 22 2018 2:17 PM

అమ్మా నన్ను క్షమించు... - Sakshi

అమ్మా నన్ను క్షమించు...

‘అమ్మా... నన్ను క్షమించు, ప్రేమలో ఓడిపోయా... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’... అంటూ ఓ యువకుడు తన తల్లి ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపి అదృశ్యమయ్యాడు.

తల్లికి ఎస్సెమ్మెస్ పంపి కుమారుడి అదృశ్యం

 బంజారాహిల్స్ :  ‘అమ్మా... నన్ను క్షమించు, ప్రేమలో ఓడిపోయా... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’... అంటూ ఓ యువకుడు తన తల్లి ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపి అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన అతడి తల్లి రెండు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా రోదిస్తూ కుప్పకూలిపోయింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్‌లో నివసించే శ్రీకాంత్(25) ఎంబీఏ చదువుతున్నాడు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగా తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ శనివారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. ‘ప్రేమలో ఓడిపోయా.. ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని గంట తర్వాత తన తల్లికి ఎస్సెమ్మెస్ పంపాడు.  ఆందోళనకు గురైన తల్లి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీకాంత్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా చిలకలగూడ ప్రాంతంలోని రైలు పట్టాల వద్ద ఉన్న టవర్ లొకేషన్ చూపించింది. వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పట్టాల వద్ద రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement