బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య | young man commits suicide in hayathnagar | Sakshi
Sakshi News home page

బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య

Jan 4 2017 6:35 PM | Updated on Nov 6 2018 7:53 PM

హయత్‌నగర్‌ పరిధిలోని శ్రీనివాస్‌ నగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది

హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్‌ పరిధిలోని శ్రీనివాస్‌ నగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న శివశంకర బ్రహ్మచారి(28) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొని.. భవనం నాలుగో అంతస్తు మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలయాలతో బ్రహ్మచారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు లవ్‌ ఫెయిల్యూరే కారణమని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement