జిరాక్స్ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్ల: జిరాక్స్ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్‌కు చెందిన గంగినాయుడు కుమార్తె పావని(18) ఓ ఇన్సూరెన్స్ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 13న జిరాక్స్ తెచ్చుకునేందుకని ఇంటి నుండి బయటకు వెళ్లిన పావని తిరిగి ఇంటికి రాలేదు.
తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.