‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ | woman committed suicide with sickness | Sakshi
Sakshi News home page

‘నా చావుకు ఎవరూ కారణం కాదు’

Jan 1 2016 10:20 AM | Updated on Nov 6 2018 8:22 PM

‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని నోట్ రాసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

నోట్ రాసి వివాహిత బలవన్మరణం
మలేసియా టౌన్‌షిప్: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని నోట్ రాసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.  కేపీహెచ్‌బీ ఎస్‌ఐ రాజయ్య కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, జ్యోత్స్నలు కేపీహెచ్‌బీ వసంతనగర్‌లో ఉంటున్నారు.  శ్రీకాంత్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుండగా.. జ్యోత్స్న గృహిణి. వీరికి ఏడాదిన్నర పాప ఉంది.  రోజూ మాదిరిగానే గురువారం ఉ దయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన శ్రీకాంత్  మధ్యాహ్నం జ్యోత్స్నకు ఫోన్ చేయగా తీయలేదు. దీంతో వాచ్‌మన్‌కు ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లమని చెప్పా డు.

వాచ్‌మన్ వెళ్లి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. లోపలి నుంచి పాప ఏడుపు వినిపించింది.  దీంతో తలుపులు పగులగొట్టి చూడగా జ్యోత్స్న ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలాన్ని పరిశీలించగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా చావుకు ఎ వరూ కారణం కాదు. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement