భర్త తిట్టాడని.. సాగర్లో దూకేందుకు యత్నం! | wife committed suicide at hussainsagar | Sakshi
Sakshi News home page

భర్త తిట్టాడని.. సాగర్లో దూకేందుకు యత్నం!

Oct 17 2015 10:58 PM | Updated on Sep 3 2017 11:06 AM

భర్త తిట్టాడని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించిన ఓ మహిళను లేక్ పోలీసులు రక్షించారు.

రాంగోపాల్‌పేట్: భర్త తిట్టాడని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించిన ఓ మహిళను లేక్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట్‌కు చెందిన శుభకర్, కుంట భాగ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ విషయంలో ఇటీవల  ఆవేశంలో భర్త ఆమెను దూషించాడు. దీంతో ఆమె తీవ్ర మనోవేధనకు గురై చనిపోవాలని నిశ్చయించుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తున్న ఆమెను గుర్తించిన లేక్ పోలీసులు రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ కోసం అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు భర్తతో పాటు పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement