'కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతాం' | Why KCR changed his words on Dalit CM asks Manda Krishna | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతాం'

Mar 28 2014 1:08 PM | Updated on Oct 8 2018 3:00 PM

'కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతాం' - Sakshi

'కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతాం'

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం వరంగల్లో నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం వరంగల్లో నిప్పులు చెరిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆ రాష్ట్రానికి దళితుడ్నే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాటమార్చారని ఆయన ఆరోపించారు. మాటా మార్చడం కేసీఆర్ నైజమని ఆయన అభివర్ణించారు.

 

కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సీఎంగా ప్రకటించుకుంటే తాము చూస్తు ఉరుకోమన్నారు. కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్ నుంచి తరిమికొడతామని మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఓ విధంగా రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో మరో విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. అసలు కేసీఆర్ ఎందుకు మాటమార్చారో సమాధానం చెప్పాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement