మోదీ, కేసీఆర్ వేరు కాదు... అందరూ... | we will try more funds allotted to hyderabad in railway budget, says Bandaru Dattatreya | Sakshi
Sakshi News home page

మోదీ, కేసీఆర్ వేరు కాదు... అందరూ...

Jan 3 2016 12:22 PM | Updated on Sep 4 2018 5:07 PM

మోదీ, కేసీఆర్ వేరు కాదు... అందరూ... - Sakshi

మోదీ, కేసీఆర్ వేరు కాదు... అందరూ...

హైదరాబాద్ను విశ్వనగరం చేయడానికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్లో తెలిపారు.

హైదరాబాద్ : హైదరాబాద్ను విశ్వనగరం చేయడానికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్లో తెలిపారు. మైట్రో రైలు పూర్తి చేస్తే ... ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీని తీసుకువస్తానని దత్తాత్రేయ వెల్లడించారు.  ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేరు కాదు... అందరూ జట్టు సభ్యులే అని దత్తాత్రేయ చెప్పారు.

వచ్చే రైల్వే బడ్జెట్లో హైదరాబాద్కు అధిక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అలాగే మూసి నది ప్రక్షాళనకు నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement