'ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించం' | We do not tolerate to allegations on Telangana govt, says Niranjan reddy | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించం'

Sep 17 2016 1:12 PM | Updated on Sep 4 2017 1:53 PM

తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: బానిసత్వాన్ని చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. మీకు చేతనైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించకుండా చూడండని హితవు పలికారు.

తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తూ  చంద్రబాబు  కేంద్రానికి లేఖ రాయడంపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement