రోజాకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పరామర్శ | vijayasai reddy, chevireddy bhaskar reddy visits mla roja at NIMS hospital | Sakshi
Sakshi News home page

రోజాకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పరామర్శ

Mar 19 2016 2:51 PM | Updated on Aug 18 2018 5:18 PM

రోజాకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పరామర్శ - Sakshi

రోజాకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పరామర్శ

నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు.

హైదరాబాద్ : నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్యంగ గురించి అడిగి తెలుసుకున్నారు.

 

సస్పెన్షన్పై సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీకి అనుమతించకపోవడంతో మండుటెండలో మౌనదీక్ష చేసిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం నిమ్స్కు తరలించారు. రోజాకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవటంతో ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement