భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మార్చి 5, 6 తేదీలలో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.
హైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మార్చి 5, 6 తేదీలలో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శనివారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్‌సిన్హా ..ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మార్చి 5న హైదరాబాద్‌లోని ఆర్‌టిసి హాలులో నిర్వహించే రైతు సంఘం 29వ జాతీయ మహా సభల సందర్భంగా నిర్వహించనున్న సెమినార్‌ని ఉపరాష్ట్రపతి ప్రారంభించననున్నట్లు అధర్‌సిన్హా తెలిపారు.
మార్చి 6 న ఆగాఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కుతుబ్ షాహి టూంబ్స్ పనులను పరిశీలించనున్నారని అన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవసరమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత, రహదారుల మరమ్మతులు, బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు.. తదితర శాఖల ద్వారా నిర్వహించే పనులను చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రాజీవ్ త్రివేది, ఐజి. శ్రీ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.