పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
బోడుప్పల్: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ యాదవబస్తీకి చెందిన కురకల వెంకటేశ్(45), రుక్కమ్మ దంపతులు. వారికి రాధిక అనే కుమార్తె ఉంది. ఆమెను రాజేశ్ అనే వ్యక్తికి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. రాజేశ్, రాధిక మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఈనెల 24న కుమార్తె దగ్గరకు వెంకటేశ్ వెళ్లాడు. అక్కడ మాట మాట పెరిగి అల్లుడు రాజేశ్, వెంకటేశ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో రాజేశ్ కుటుంబ సభ్యులు వెంకటేశ్‌పై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వెంకటేశ్ ఇంటికి వచ్చిన తరువాత ఈనెల 28న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వెంకటేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.