నయీం కేసులో మరో ఇద్దరు అరెస్ట్ | two more arrests in nayeem gang | Sakshi
Sakshi News home page

నయీం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

Sep 2 2016 9:35 AM | Updated on Oct 16 2018 9:08 PM

ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement