తెలంగాణ అభివృద్ధి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్ | TRS MLAs Takes on Congress and TDP | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్

Aug 10 2015 1:40 PM | Updated on Sep 3 2017 7:10 AM

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాలరాజులు మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీయకుండా పాదయాత్ర పేరిట టీడీపీ నేతలు డ్రామా ఆడుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ పార్టీ అమలు చేస్తోదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాలరాజు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement