'డీకే అరుణది దోచుకునే చరిత్ర' | trs mla balaraju fires on dk aruna | Sakshi
Sakshi News home page

'డీకే అరుణది దోచుకునే చరిత్ర'

Apr 17 2016 7:34 PM | Updated on Sep 3 2017 10:08 PM

'డీకే అరుణది దోచుకునే చరిత్ర'

'డీకే అరుణది దోచుకునే చరిత్ర'

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన చరిత్ర తమదైతే.. రాజకీయాల్లో దోచుకునే చరిత్ర డీకే అరుణదని ఆయన విమర్శించారు.

డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే మంత్రి జూపల్లి కృష్ణారావు అని బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి ఆమెకు లేదని అన్నారు. ఇటీవల డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డీకే అరుణ, జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement