రాష్ట్రపతి పర్యటన..ట్రాఫిక్ ఆంక్షలు


సాక్షి, సిటీబ్యూరో: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేసిన దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో జరిగే విందుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఆయన కోరారు. పరిస్థితుల్ని బట్టి ఆ సమయాల్లో, ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపడమో జరుగుతుందన్నారు.

 

 రాత్రి 7.20- 8.10 మధ్య...

 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం-మల్లారెడ్డినగర్-లోతుకుంట వై జంక్షన్-ఎసీఈఎంఈ సిగ్నల్-లాల్‌బజార్ టి జంక్షన్-హోలీఫ్యామిలీ చర్చ్-తిరుమలగిరి చౌరస్తా

 

 

 -ఆర్టీఏ ఆఫీస్-హనుమాన్ టెంపుల్-కార్ఖానా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్-విక్రమ్‌పురిలోని ఆక్సిజన్ ఆసుపత్రి-సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్-ఎన్‌సీసీ డెరైక్టరేట్ చౌరస్తా

 

 -టివోలీ ఎక్స్ రోడ్-ప్లాజా చౌరస్తా-సీటీఓ ఫ్లైఓవర్-రసూల్‌పుర చౌరస్తా-పీఎన్‌టీ జంక్షన్-బేగంపేట ఫ్లైఓవర్-గ్రీన్‌లాండ్స్ చౌరస్తా-మొనప్ప ఐలాండ్-యశోద ఆస్పత్రి-విల్లామేరీ కళాశాల-ఎంఎంటీఎస్ స్టేషన్-రాజ్‌భవన్.

 

  విందు పూర్తయిన తరవాత రాష్ట్రపతి తిరిగి వె ళ్లే సమయంలోనూ ఆంక్షలు అమలులో ఉంటాయి.

 

 మళ్లింపులు ఈ ప్రాంతాల్లో..

 ఏఓసీ సెంటర్ నుంచి ఎయిర్‌టెల్ వైపు వెళ్లే వాహనాలను లక్ష్మీనగర్ నుంచి జేబీఎస్ మీదుగా మళ్లిస్తారు.

 

 అమ్ముగూడ బాలాజీనగర్, నాగదేవత దేవాలయం వైపు నుంచి లాడ్ బజార్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్కే పురం వైపు పంపిస్తారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top