వెఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశం నేడు | today ysrcp Coordinator meeting | Sakshi
Sakshi News home page

వెఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశం నేడు

Aug 17 2016 1:39 AM | Updated on May 25 2018 9:20 PM

వెఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశం నేడు - Sakshi

వెఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశం నేడు

వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల, ఎమ్మెల్యేల రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 17న జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల, ఎమ్మెల్యేల రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 17న జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంపై ప్రధానంగా సమీక్షిస్తారని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న ఉద్యమమే ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమమని ఆయన వివరించారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత తీవ్రంగా ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై బుధవారం నాటి సమావేశంలో చర్చించి కార్యాచరణను రూపొందించుకుంటామని కోటంరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement