నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. గోదావరిపై నిర్మించతలపెట్టిన ఐదు ఆనకట్టల విషయమై నేడు మహారాష్ట్రతో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందాలు..
మహిళా దినోత్సవం: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా పలు దేశాల్లోని మహిళా సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు: మూడురోజుల విరామం అనంతరం మంగళవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: శనివారంనాటి గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదాపడిన ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి కొనసాగనున్నాయి.
మహా ఒప్పందం: గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన ఐదు ఆనకట్టల విషయమై మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం నేడు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇందుకోసం సోమవారమే ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్.. మంగళవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో సమావేశం కానున్నారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
పాలిసెట్: నేటి నుంచి పాలిసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 10 లోగా దరఖాస్తులు పూరించి పంపాల్సిఉంటుంది. ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాకు చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
పీఎస్ఎల్ వీ: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఎల్లుండి ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ 32 ఉపగ్రహ ప్రయోగానికి నేటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
టీ20 క్రికెట్ వరల్డ్ కప్: నేటి నుంచి టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల క్వాలిఫయర్ మ్యాచ్ లు ప్రారంభం.
బ్యాడ్మింటన్: నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభంకానున్నాయి.
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేయిఉన్నారు. కాలినడకన వచ్చే భక్తులు మూడు గంటల్లోగా స్వామివారిని దర్శించుకునే వీలంఉంది.
సూర్యగ్రహణం: బుధవారం సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో నేటి రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు.