నేడు పాలీసెట్-2016 ఫలితాలు | Today is paliset - 2016 Results | Sakshi
Sakshi News home page

నేడు పాలీసెట్-2016 ఫలితాలు

May 2 2016 4:20 AM | Updated on Sep 3 2017 11:12 PM

పాలీసెట్-2016 ఫలితాలను సోమవారం విడుదల చేయాలని నిర్ణయించినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: పాలీసెట్-2016 ఫలితాలను సోమవారం విడుదల చేయాలని నిర్ణయించినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మధ్యాహ్నం ఫలితాలను విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఇక ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 17 నుంచి ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ మొదట్లో భావించినా.. అది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ ఫలితాలు వస్తేనే కౌన్సెలింగ్ చేపట్టే వీలుంది. అయితే పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈనెల 18న ప్రకటించాలని భావిస్తున్నా, ఒకవేళ సాధ్యం కాకపోతే 22 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాలీసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను 17న జారీ చేసి, 22 తర్వాత కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement