breaking news
Director of technical education
-
నేడు పాలీసెట్-2016 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్-2016 ఫలితాలను సోమవారం విడుదల చేయాలని నిర్ణయించినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మధ్యాహ్నం ఫలితాలను విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఇక ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 17 నుంచి ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ మొదట్లో భావించినా.. అది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ ఫలితాలు వస్తేనే కౌన్సెలింగ్ చేపట్టే వీలుంది. అయితే పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈనెల 18న ప్రకటించాలని భావిస్తున్నా, ఒకవేళ సాధ్యం కాకపోతే 22 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాలీసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను 17న జారీ చేసి, 22 తర్వాత కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. -
నేడు పాలీసెట్
♦ యథావిధిగా పరీక్ష నిర్వహణకు సహకరిస్తామన్న యాజమాన్యాలు ♦ హాజరుకానున్న అభ్యర్థులు 1,27,951 మంది ♦ గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి ♦ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ♦ 10 రోజుల్లో ఫలితాలు.. మేలో కౌన్సెలింగ్.. జూన్ 9 నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా గురువారం (ఈనెల 21న) జరగనుంది. పరీక్ష నిర్వహణకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చాయని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 54 వేల సీట్ల భర్తీకి పాలిసెట్‌ను నిర్వహిస్తున్నామని... 1,27,951 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ప్రైవేటు కాలేజీల్లో 209, ప్రభుత్వ కాలేజీల్లో 79 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష గురువారం ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని.. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లవద్దని సూచించారు. పది రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రవేశాల జాప్యంతో 50% డ్రాపవుట్స్ ఏటా పాలిటెక్నిక్ ప్రవేశాలు ఆలస్యం అవుతుండటం వల్ల గ్రామీణ విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని... 40 శాతం నుంచి 50 శాతం వరకు డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారని ఎంవీ రెడ్డి వివరించారు. దీంతో ఈసారి పాలీసెట్‌ను అన్నింటికంటే ముందుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు తాత్కాలిక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేశామని.. వచ్చే నెల చివరి రెండు వారాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని, ఆలోగా కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. చేర్యాల, సాగర్‌లలో కొత్త కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో చేర్యాల, నాగార్జునసాగర్‌లలో రెండు కొత్త కాలేజీలను ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిందని ఎంవీ రెడ్డి వెల్లడించారు. ఒక్కో కాలేజీలో రెండు బ్రాంచీల్లో కలిపి 240 చొప్పున సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక సికింద్రాబాద్, హుస్నాబాద్‌లలో భవన నిర్మాణాలు పూర్తి కానందున ఏఐసీటీఈ అనుమతి రాలేదన్నారు.