అధికారికంగా నిర్వహించాలి | To be done officially | Sakshi
Sakshi News home page

అధికారికంగా నిర్వహించాలి

Aug 30 2016 2:11 AM | Updated on Mar 29 2019 9:31 PM

హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల

విమోచన దినంపై బీజేపీ
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల తొలిరోజున బీజేఎల్పీ డిమాండ్ చేయనుంది. టీఆర్‌ఎస్ గతంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది.

ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే వరకు పార్టీపరంగా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించినట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెం బ్లీ ఎదుటనున్న మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement