ప్రభుత్వ ఉద్యోగులకు 3.1444 శాతం డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు 3.1444 శాతం డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సదరు ఫైల్పై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.